బెంగళూరు : భారత క్రికెట్లో దేశవాళీ సీజన్ ఆరంభానికి ముహూర్తం కుదిరింది. ఈనెల 28 నుంచి ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ మొదలుకానుంది. బెంగళూరు వేదికగా ఆరుజట్లతో జరుగబోయే ఈ టోర్నీ ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 15 వరకు జరుగనుంది. ఆగస్టు 28-31 మధ్య నార్త్ జోన్, ఈస్ట్ జోన్ మధ్య తొలి క్వార్టర్స్ జరుగనుండగా అదే తేదీల్లో సెంట్రల్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ తలపడనున్నాయి.
సెప్టెంబర్ 4 నుంచి 7 దాకా సెమీస్ మ్యాచ్లు జరుగనుండగా 11 నుంచి ఫైనల్ మొదలవనుంది. సౌత్ జోన్, వెస్ట్ జోన్ నేరుగా సెమీస్ బెర్తులను ఖాయం చేసుకోగా మిగిలిన బెర్తుల కోసం నాలుగు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. సౌత్ జోన్కు హైదరాబాదీ తిలక్ వర్మ సారథిగా వ్యవహరించనున్నాడు.