Asia Cup : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఆసియా కప్ (Asia Cup) టోర్నీ మొదలైంది. ఈ మెగా టోర్నీలో భారత్, పాకిస్థాన్ సహ, పలు కీలక మ్యాచ్‌లకు టికెట్లు హాట్‌కేకులా మారాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యాపారవేత్త కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఆసియా కప్ టికెట్లు కొనిచ్చాడు. అలాఅనీ వంద రెండొందలు కాదు.. ఏకంగా 700 టికెట్లు పంచాడీ బాస్. ఇంతకూ అతడు ఎందుకిలా చేశాడో తెలుసా..?
ప్రైవేట్ కంపెనీల్లో ఉత్తమంగా పనిచేసే ఉద్యోగులకు బొనాంజాలు, రివార్డులు మామూలే. కొన్ని సంస్థలు విలువైన బహుమతులు ఇస్తాయి. మరొకొన్నేమో కార్లు, ఇళ్ల స్థలాలు వంటివి ఇవ్వడం చూశాం. అయితే.. దుబాయ్‌కు చెందిన Danube Group యజమాని తన స్టయిలే వేరని నిరూపించాడు. యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్ టికెట్లను ఉద్యోగులకు కానుకగా అందించాడు.
#Dubai businessman #AnisSajan has distributed over 700 #AsiaCup tickets to blue-collar workers, allowing them to experience live #Cricket action in the #UAE.https://t.co/5Cxh9bffP6 pic.twitter.com/N3mEnbYyeI
— Khaleej Times (@khaleejtimes) September 10, 2025
డనుబే గ్రూప్ (Danube Group) అనేది దుబాయ్‌లోని రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇదే కాకుండా పలు వ్యాపారాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ‘యూఏఈలో ఆసియా కప్ వంటి మెగా టోర్నీలు జరగడం అరుదు. అలాంటి మ్యాచ్‌లు ఉన్నప్పుడు మా కంపెనీలో అలుపెరగకుండా పనిచేసి.. పురోగతిలో భాగమయ్యే ఉద్యోగులకు రివార్డ్ ఇవ్వాలనుకున్నాం. వాళ్లు తమ అభిమాన క్రికెటర్ల ఆటను ఆస్వాదించేలా చేయాలనుకున్నాం. అందుకే.. ఆసియా కప్ టికెట్లను పంపిణీ చేశాం’ అని వైస్ ఛైర్మన్ అనిస్ సజన్ స్థానిక మీడియాకు తెలియజేశాడు.
‘ఖలీజ్ టైమ్స్’తో అనిస్ సజన్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 14న జరుగబోయే భారత్ పాకిస్థాన్ మ్యాచ్ కోసం 100 టికెట్లు తీసుకున్నాం. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ ఒక్కో టికెట్ ధర రూ.8,742.47. అలానే సూపర్ 4 మ్యాచ్‌కు 100 టికెట్లు.. ఫైనల్ కోసం మరో వంద టికెట్లు కొనుగోలు చేశాం అని వెల్లడించాడు.
VIDEO | Dubai: Blue-collar workers at Danube Group get free tickets to all the matches for the Asia Cup in the UAE.
Anis Sajan, Vice Chairman of Danube Group, says, “… Now that the matches are happening in Dubai and Abu Dhabi, it won’t be fair on my part if I do not give my… pic.twitter.com/tdGxeD1kYV
— Press Trust of India (@PTI_News) September 10, 2025