హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర క్రికెట్లో తెలంగాణ జిల్లాల క్రికెట్ అసోసియేషన్(టీడీసీఏ).. డీఆర్ఎస్ విధానాన్ని ప్రవేశపెట్టి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. శంషాబాద్‌లో జరుగుతున్న టీడీసీఏ వన్డే టోర్నీలో అమెరికా అండర్-17 యూత్ టీమ్ తమ హవాను కొనసాగిస్తున్నది. మంగళవారం జరిగిన వేర్వేరు మ్యాచ్‌ల్లో తెలంగాణ రూరల్ ఫాంథర్స్, అమెరికా జట్లు ఘన విజయాలు సొంతం చేసుకున్నాయి.
తెలంగాణ రూరల్ రైజర్స్‌తో మ్యాచ్‌లో అమెరికా 164 పరుగుల తేడాతో గెలిచింది. సహర్శ్ (72), అద్నిత్ (58), తనుశ్ (50) అర్ధసెంచరీలతో రాణించారు. రాష్ట్ర స్థాయి క్రికెట్లో డీఆర్ఎస్ను ప్రవేశపెట్టి ఆటలో మరింత జవాబుదారీతనం పెంచిందని టీడీసీఏ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.