న్యూఢిల్లీ: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రస్తుతం టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ డైరెక్టర్గా వ్యవహరిస్తుండగా.. మరోసారి అతడికే చాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 జూలైలో ఎన్సీఏ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. భారత అండర్-19, భారత-ఏ జట్లకు కోచ్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దరఖాస్తుకు ఈనెల 15 తుది గడువు కాగా.. ద్రవిడ్ మరోసారి డైరెక్టర్ అయ్యే అవకాశాలున్నాయి.
‘జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా ఎంపికైన వ్యక్తి యువ ఆటగాళ్లకు సంబంధించి అన్ని వ్యవహారాలు చూసుకోవాలి. ఆటగాళ్ల సన్నద్ధత, వారి ప్రదర్శన మెరుగుపర్చడానికి కృషి చేయాలి. ఈ లెక్కన ద్రవిడ్ మరోమారు దరఖాస్తు చేసే చాన్స్లున్నాయి. ద్రవిడ్.. భారత కోచ్గా ఎంపికయ్యే అవకాశాలూ లేకపోలేదు’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.