FIFA World Cup | అర్జెంటీనాపై 10 లక్షల డాలర్ల పందెం కాసిన కెనడా సింగర్
గతంలో బార్సిలోనాపై 60 లక్షల డాలర్లు పందెం
FIFA World Cup : ఫేవరెట్ జట్లలో ఒకటైన అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ ఫైన్లలో అడుగుపెట్టింది. దాంతో, ఆ జట్టు ఈసారి ట్రోఫీని ఎగరేసుకుపోవడం ఖాయమని చాలామంది భావిస్తున్నారు. అర్జెంటీనా వరల్డ్ కప్ ఫైనల్ గెలుస్తుందని కెనడాకు చెందిన సింగర్, ర్యాపర్ డ్రేక్ భారీ బెట్టింగ్ కాశాడు. ఫైనల్లో ఫ్రాన్స్‌ను చిత్తుగా ఓడిస్తుందని 10 లక్షల డాలర్ల బెట్టు కాశాడు. ఫైనల్ సందర్భంగా స్క్రీన్‌షాట్ తీసి ఆన్లైన్లో పోస్ట్ చేశాడు. ఒకవేళ అర్జెంటనీ గెలిస్తే డ్రేక్‌కు 17.5 లక్షల డాలర్లు వస్తాయి. అయితే, డ్రేక్ పందేం కాయడం అర్జెంటీనా పట్ల శాపంగా మారుతుందని కొందరు అంటున్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌ల మీద బెట్టింగ్ వేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బార్సిలోనా జట్టు రియల్ మాడ్రిడ్‌పై, ఆర్సెనల్ జట్టు లీడ్స్‌పై విజయం సాధిస్తుందని 60 లక్షల డాలర్లు పందెం కాశాడు.
అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్టు ఫిఫా వరల్డ్ కప్‌లో 3 సార్లు తలపడ్డాయి. రెండు మ్యాచుల్లో అర్జెంటీనా, ఒక మ్యాచ్ ఫ్రాన్స్ గెలిచింది. దాంతో ఈసారి కూడా ఫ్రాన్స్‌పై, అర్జెంటీనా పై చేయి సాధిస్తే మెస్సీ కల నెరవేరినట్టే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

