కాంగ్రెస్ తెచ్చిన కరువు
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరాయపల్లికి చెందిన రైతు వడ్డె లక్ష్మయ్య రెండెకరాల్లో వరి పంటు సాగు చేయగా.. సాగునీరు అందక పొట్ట దశలో పంట ఎండిపోయింది.
- రెండెకరాలు.. పశువులపాలు

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వీరాయపల్లికి చెందిన రైతు వడ్డె లక్ష్మయ్య రెండెకరాల్లో వరి పంటు సాగు చేయగా.. సాగునీరు అందక పొట్ట దశలో పంట ఎండిపోయింది. పంట పెట్టుబడి, కూలీల ఖర్చులు కలిపి రూ.70 వేల వరకు అయ్యాయని రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. పంట పూర్తిగా ఎండిపోవడంతో చేసేది లేక చివరకి గేదెలను మేతకు వదిలివేసినట్టు చెప్పి కన్నీటి పర్యంతమయ్యాడు.
-పెద్దమందడి
- కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే పంటలు ఎండుతున్నయ్
కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలు, సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్షాయిపేటలో కరెంట్ కోతల కారణంగా ఎండుతున్న వరి పంటలను బుధవారం ఆయన పరిశీలించి, రైతులతో మాట్లాడి సమస్యలు తెలుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే విద్యుత్ అధికారితో ఫోన్లో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను వివరించి, పంటలు ఎండిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
-కొండాపూర్
- ఖాళీ బిందెలతో మహిళల నిరసన
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం ఎర్రగుంటపల్లిలో కాంగ్రెస్ సర్పంచ్‌తో పాటు ఆమె భర్త తీరుకు నిరసనగా బోరుబావి వద్ద మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. చాకలివాడలో ఉన్న బోరుకు విద్యుత్తు మోటర్ చెడిపోయి 4 నెలలైందని ఈ సందర్భంగా మహిళలు చెప్పారు.

మరో చోట ఉన్న బోరుబావి మోటర్‌ను సర్పంచ్ అనుమతితో తీసుకొచ్చి ఇక్కడ బిగించారని తెలిపారు. ఆ మోటర్ దారా కాలనీవాసులు నీళ్లుపట్టుకుంటుండగా ‘సమాచారం ఇవ్వకుండా మోటర్‌ను ఎలా ప్రారంభిస్తారు’ అంటూ ఆగ్రహంతో సర్పంచ్ భర్త వచ్చి బిగించిన మోటర్‌ను తీసుకెళ్లినట్టు తెలిపారు. ఉప సర్పంచ్‌కే ఆ క్రెడిట్ దక్కుతుందనే ఇలా చేశాడని ఆరోపించారు. సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకొని, తాగునీటి సమస్య పరిష్కరించాలని వారు కోరారు.
– చెన్నూర్ రూరల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

