న్యూఢిల్లీ: తైవాన్ ఓపెన్‌లో భారత యువ జావెలిన్ త్రోయర్ డీపీ మను పసిడి పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన పురుషుల జావెలిన్‌త్రో ఈవెంట్లో మను..బరిసెను 81.58మీటర్ల దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. ఏషియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచిన మను.. తన ఆఖరి అవకాశంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. తొలుత ఈటెను 78.32మీటర్ల విసిరిన ఈ 24 ఏండ్ల యువ అథ్లెట్ రౌం డ్ రౌండ్‌కు దూరాన్ని పెంచుకుంటూ పోయాడు. ఈ క్రమంలో తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన (84.35మీ) అందుకోలేకపోయిన మను.. టాప్‌తో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు.