Dowry Case | అర్జున అవార్డు గ్రహీత, బాక్సింగ్‌లో మాజీ ప్రపంచ చాంపియన్ అయిన స్వీటీ బోరా వరకట్న వేధింపులను ఎదుర్కొన్నారు. ఈ మేరకు ఆమె భర్త, ఆసియా క్రీడల్లో కాంస్య పతక విజేత అయిన దీపక్ హుడాపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. భర్తతో అతని కుటుంబం వరకట్నం కోసం తనను కొట్టారని స్వీటీ ఆరోపించింది. వీరిద్దరూ 2022లో పెల్లి చేసుకున్న విషయం తెలిసిందే. హర్యానాలోని హిసార్‌లో హుడాపై స్వీట్ కేసు పెట్టింది. ఈ విషయంపై హిసార్ వుమెన్స్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో సీమా మాట్లాడుతూ స్వీటీ బోరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్త దీపక్ హుడాపై ఈ నెల 25న ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. విచారణ కోసం రావాలని రెండుమాడు సార్లు నోటీసులు ఇచ్చినా.. అతను రాలేదని తెలిపారు. అయితే, హుడాను సంప్రదించగా.. ఆరోగ్యం బాగాలేదని చెప్పినట్లు ఓ నివేదిక పేర్కొంది. తాను స్ట్రోక్ బారినపడ్డానని.. దాంతో హాజరుకాలేకపోయినట్లు జాతీయ మీడియా నివేదిక పేర్కొంది.
తాను తప్పనిసరిగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తానని.. తాను మాత్రం భార్యకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయనని తెలిపాడు. దీనిపై స్వీటీని సంప్రదించగా.. స్పందించేందుకు నిరాకరించింది. హుడాపై వచ్చిన ఆరోపణలపై మహిళా పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో మాట్లాడుతూ.. అదనపు వరకట్నం కోసం వేధింపులకు పాల్పడడంతో పాటు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. లగ్జరీ కారు డిమాండ్ చేశాడని.. అది నెరవేరడంతో డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని.. ఎస్‌హెచ్‌వో తెలిపారు. స్వీటీ ఫిర్యాదు మేరకు సెక్షన్ 85 కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఇదిలా ఉండగా.. దీపక్ హుడా 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రోహ్తక్ జిల్లాలోని మెహం నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. 2016 దక్షిణాసియా క్రీడల్లో బంగారు పతకం, 2014 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన భారత కబడ్డీ జట్టు హుడా సభ్యుడు. ప్రో కబడ్డీ లీగ్‌లో సైతం పాల్గొన్నాడు.