ముంబై: ఐపీఎల్ తర్వాతి సీజన్ కోసం త్వరలో నిర్వహించబోయే వేలానికి ముందు ఆయా జట్లు తాము అట్టిపెట్టుకునే (రిటెన్షన్) ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసుకుంటున్న తరుణంలో ఏ ఏ ఫ్రాంచైజీలు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటాయనే దానిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు సార్లు ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్ తమ సారథి హార్దిక్ పాండ్యాను రూ. 18 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంటుందా? అంటూ సన్‌రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు.
ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడీ మాట్లాడుతూ.. ‘హార్దిక్ పాండ్యా రూ. 18 కోట్ల విలువ చేసే ఆటగాడా? అతడికి అంత సామర్థ్యం ఉందా? ఆ స్థానంలో తీసుకున్న ఆటగాడు మ్యాచ్ విన్నర్ అయి ఉండాలి. కానీ గతేడాది పాండ్యా ముంబైని నడిపించిన తీరు, అతడి వ్యక్తిగత ప్రదర్శన నిరాశజనకంగా ఉంది. నేనైతే రూ. 18 కోట్ల జాబితాలో బుమ్రా, సూర్యను ఎంచుకుంటాను. హార్దిక్‌కు రూ. 14 కోట్లు చాలు’ అని అభిప్రాయపడ్డాడు.