బతుమి (జార్జియా): ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతున్నది. ఈ టోర్నీలో ఇప్పటికే కోనేరు హంపి సెమీస్‌కు చేరి కొత్త చరిత్ర సృష్టించగా సోమవారం మరో భారత అమ్మాయి దివ్య దేశ్‌ముఖ్ సైతం సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. క్వార్టర్స్ పోరులో మరో భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికతో ఆడిన రెండు గేమ్స్ డ్రా గా ముగియడంతో ఫలితం తేలేందుకు సోమవారం టైబ్రేకర్‌ను నిర్వహిచంగా.. ఆ పోరులో దివ్య.. 3-1తో హారికను ఓడించి సెమీస్ చేరింది. లాస్ట్-4లో దివ్య.. తాన్ జ్యోంగి (చైనా)తో తలపడనుంది. ఇక మంగళవారం జరిగే తొలి సెమీస్‌లో హంపి, బుధవారం జరుగనున్న రెండో సెమీస్‌లో దివ్యలో ఎవరు గెలిచినా ఫైనల్ చేరిన తొలి భారత మహిళా చెస్ ప్లేయర్‌గా రికార్డులకెక్కుతారు.