SLW vs NZW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో సొంతగడ్డపై శ్రీలంక బ్యాటర్లు దంచేశారు. గత మ్యాచ్‌లో విఫలమైనా కెప్టెన్ చమరి ఆటపట్టు (53) అర్ధ శతకంతో కదం తొక్కగా.. ఓపెనర్ విష్మీ గుణరత్నే(42), హాసిని పెరీరా (44) సాధికారిక ఇన్నింగ్స్ ఆడింది. అయితే.. మిడిల్ ఓవర్లలో న్యూజిలాండ్ బౌలర్లు కీలక వికెట్లు తీయగా స్కోర్ 220 దాటడమే గగనం అనిపించింది. కానీ, డెత్ ఓవర్లలో నీలాక్షి డిసిల్వా(55 నాటౌట్) బౌండరీలతో రెచ్చిపోవడంతో లంక 6 వికెట్ల నష్టానికి 258 రన్స్ చేయగలిగింది.
స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయిన శ్రీలంక అనూహ్యంగా పుంజుకుంది. మంగళవారం ప్రేమదాస మైదానంలో టాపార్డర్ రాణించడంతో న్యూజిలాండ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది లంక. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న జట్టుకు ఓపెనర్లు విష్మీ గుణరత్నే(42) , చమరి ఆటపట్టు (53) శుభారంభమిచ్చారు. శతక భాగస్వా్మ్యం నెలకొల్పిన ఈ ద్వయాన్ని కివీస్ కెప్టెన్ సోఫీ డెవినే విడదీసింది. అర్ధ శతకం తర్వాత గేర్ మార్చాలనుకున్న ఆటపట్టు.. సిక్సర్‌కు యత్నించి బౌండరీ వద్ద మ్యాడీ గ్రీన్ చేతికి చిక్కింది. దాంతో.. తొలి వికెట్ 101 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
A late push by Nilakshika de Silva takes the hosts to a competitive total, who have the momentum going into the break. New Zealand are looking at a tough chase ahead 💪 #SLvNZ
Scorecard 👉 https://t.co/BVpI9NQ7wx | #CWC25 pic.twitter.com/JmQlzenWPk
— ESPNcricinfo (@ESPNcricinfo) October 14, 2025
ఆటపట్టు వెనుదిరిగాక.. గుణరత్నే జతగా హాసిని పెరీరా(44) జట్టుకు భారీ స్కోర్ అందించే బాధ్యత తీసుకుంది. కానీ, గుణరత్నేను బౌల్డ్ చేసిన రోస్మెరీ రెండో వికెట్ అందించింది. ఆతర్వాత వచ్చిన హర్షిత సమరవిక్రమ(26), పెరీరా హాఫ్ సెంచరీ భాగస్వామ్యంతో స్కోర్ 180 దాటించారు. దాంతో.. లంక భారీ స్కోర్ దిశగా సాగింది. ధాటిగా ఆడే క్రమంలో సమరవిక్రమ, కవిశ దిల్హరి(4)లు వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నీలాక్షి డిసిల్వా(55 నాటౌట్ 28 బంతుల్లోనే 7 ఫోర్లు, ఒక సిక్సర్) దూకుడే మంత్రగా చెలరేగింది. టెయిలెండర్లతో కలిసి జట్టు స్కోర్.. 250 దాటించిన ఆమె. డెవినె వేసిన 50 వ ఓవర్లో మూడు బౌండరీలు బాదిన డిసిల్వా అర్ధ శతకం పూర్తి చేసుకుంది. ఈ ప్రపంచకప్‌లో వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన తను ఆ ఓవర్లో 16 రన్స్ పిండుకోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి లంక 258 పరుగులు చేయగలిగింది.
Nilakshi de Silva has played the innings of her life! 🔥
26-ball fifty – the fastest of CWC 2025, as she finished on 55*(28) 🙌
Catch the LIVE action ➡ https://t.co/XowRxgmZ7c#CWC25 👉 #SLvNZ | LIVE NOW on Star Sports & JioHotstar pic.twitter.com/CWkH9YGDKT
— Star Sports (@StarSportsIndia) October 14, 2025