హైదరాబాద్, ఆట ప్రతినిధి: సుదీర్ఘ విరామం తర్వాత రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనున్న టీ20 మ్యాచ్‌కు సకల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం ఉప్పల్‌లో తుది మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్.. ఆదివారం మంత్రితో భేటీఅయ్యారు. మ్యాచ్ నిర్వాహణ, ముందస్తు ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్పోర్ట్స్ హబ్‌గా పేరుగాంచిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేలా ఈ మ్యాచ్ నిర్వహించాలని అన్నారు.