జగద్గిరిగుట్ట, డిసెంబరు17 : ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని చేతల్లో చూపెట్టాడు. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తూ క్రికెట్లో అదరగొడుతున్నాడు దివ్యాంగ యువకుడు. ఒకప్పుడు బడికి దూరమై ఇంటికి పరిమితమైనా ఏనాడు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. రంగారెడ్డినగర్ డివిజన్ వెంకట్రామిరెడ్డి నగర్‌కు చెందిన సమీర్ పోలియో బాధితుడు. రెండు కాళ్లు పనిచేయకున్నా.. వీల్‌చైర్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు.
ఈనెల 6న భోపాల్ జరిగిన జాతీయ పోటీల్లో తెలంగాణ వికెట్‌కీపర్‌గా జట్టు విజయంలో కీలకమయ్యాడు. అయితే జీవనోపాధి కోసం సమీర్ ప్రస్తుతం ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నట్లు తెలిపాడు. టోర్నీలో బెస్ట్ కీపర్‌గా నిలిచి హైదరాబాద్‌కు వచ్చిన సమీర్‌ను అతని స్నేహితులు ఘనంగా సన్మానించారు. ఆర్థిక తోడ్పాటు అందిస్తే..భవిష్యత్‌లో మరింత మెరుగ్గా రాణించేందుకు సిద్ధంగా ఉన్నానని ఈ యువ క్రికెటర్ర ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.