లక్నో: లక్నోసూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠిపై మ్యాచ్ సస్పెన్షన్ పడింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్శర్మతో వాగ్వాదానికి దిగిన దిగ్వేశ్‌పై ఒక మ్యాచ్ వేటుతో పాటు ఫీజులో 50 శాతం కోత విధించారు.
అభిషేక్ ఔటైనా వెంటనే తన ట్రేడ్‌మార్క్ ‘టిక్ ద నోట్‌బుక్’ శైలిలో దిగ్వేశ్ సంజ్ఞ చేస్తూ కవ్వించే ప్రయత్నం చేశాడు. అభిషేక్ ఫీజులో 25శాతం ఫైన్, డీమెరిట్ పాయింట్ వేశారు.