IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో గురు శిష్యుల పోరుకు వేళైంది. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(CSK).. రిషభ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్(LSG)తో కీలక మ్యాచ్కు సిద్ధమవుతోంది. హ్యాట్రిక్ విక్టరీలతో జోరు మీదున్న లక్నోను సోమవారం సీఎస్కే ఢీ కొడుతోంది.
లక్నో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ధోనీ ఆతిథ్య జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. లక్నో ఒక మార్పుతో ఆడుతుండగా.. చెన్నై రెండు మార్పులు చేసిందని ఇరువురు కెప్టెన్లు తెలిపారు. వరుసగా 5 ఓటములతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన సీఎస్కేకు ఈరోజు గెలిచి తీరాల్సిందే. లేదంటే టాప్ -5 లో నిలవడంలో కష్టమవుతుంది.
లక్నో తుది జట్టు : మిచెల్ మార్ష్, ఎడెన్ మర్క్రమ్, నికోలస్ పూరన్, ఆయుష్ బదొని, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్ధూల్ ఠాకూర్, అవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, దిగ్వేశ్ రథీ.
ఇంప్యాక్ట్ సబ్స్ : రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, షాబాజ్ అహ్మద్, మాథ్యూ బ్రీట్జ్కే, హిమ్మత్ సింగ్.
🚨 Toss 🚨@ChennaiIPL elected to field against @LucknowIPL
Updates ▶️ https://t.co/jHrifBkT14 #TATAIPL | #LSGvCSK pic.twitter.com/5V7bYuXMQ8
— IndianPremierLeague (@IPL) April 14, 2025
చెన్నై తుది జట్టు : షేక్ రషీద్, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, జేమీ ఓవర్టన్, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, వికెట్ కీపర్), అన్షుల్ కంబోజ్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, పథిరన.
ఇంప్యాక్ట్ సబ్స్ : శివం దూబే, కమలేశ్ నగర్కొటే, రామకృష్ణ ఘోష్, సామ్ కరన్, దీపక్ హుడా.