MS Dhoni : పంతొమ్మిదో సీజన్ ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)కు పెద్ద షాక్. తొలి ఎడిషన్ నుంచి సీఎస్కేకు ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మెగా టోర్నీకి దూరం కానున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని ధోనీ తొలి రెండు వారాలు ఐపీఎల్‌కు అందుబాటులో ఉండడం లేదు. తమ వెటరన్ ఆటగాడు మెగా ఈవెంట్‌కు కొన్ని రోజులు దూరం అవుతున్నాడని శనివారం సీఎస్కే యాజమాన్యం వెల్లడించింది. ధోనీ లేకుండా చెన్నై జట్టు ఐపీఎల్ ఆడనుండడం ఇదే మొదటిసారి కానుంది.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటి నుంచి పూర్తిగా ఐపీఎల్‌కే అంకితమైన మహేంద్ర సింగ్ ధోనీ తొలిసారి టోర్నీకి దూరమవుతున్నాడు. ఆరంభ సీజన్ నుంచి బ్రేక్ లేకుండా ఆడుతున్న తాలా ఈసారి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. గత సీజన్ ఫైనల్లో మోకాలి గాయంతోనే ఆడిన ధోనీ అనంతరం సర్జరీ చేయించుకున్నాడు. ఈ గాయం నుంచి కోలుకున్నా.. కండరాల గాయం ధోనీని వెంటాడింది. దాంతో, అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అందుకే రెండు వారాలు సీఎస్కీ మ్యాచ్‌లకు ధోనీ దూరం కానున్నాడు.
JUST IN: MS Dhoni, who is undergoing rehabilitation for a calf strain, is likely to miss the first two weeks of IPL 2026 pic.twitter.com/rXruwow6Wk
— ESPNcricinfo (@ESPNcricinfo) March 28, 2026
పంతొమ్మిదో ఎడిషన్ తొలి మ్యాచ్‌లో మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో సీఎస్కే తలపడనుంది. రికార్డు స్థాయిలో 278 మ్యాచ్‌లు ఆడిన ధోనీ గౌర్హాజరీలో సంజూ శాంసన్(Sanju Samson)కు వికెట్ కీపింగ్ అప్పగించే అవకాశముంది. ఇటీవలే ట్రేడ్ పద్ధతిన సీఎస్కే గూటికి చేరిన శాంసన్ ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా తన ముద్ర వేసేందుకు ఇంతకుమించిన సమయం ఉండదేమో.