Dhanashree Verma | జీవిత భాగస్వామి క్షేమాన్ని కోరుతూ మహిళలు కర్వాచౌత్ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి.. అమ్మవారికి పూజలు చేసి.. చంద్రుడి దర్శనం అనంతరం కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి విందులో పాల్గొంటారు. తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఈ వేడుకలను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కాగా, టీమిండిగా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ కర్వాచౌత్‌ను వినూత్నంగా జరుపుకుంది.
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌కోసం చాహల్ ఆస్ట్రేలియా వెళ్లాడు. ధనశ్రీ భారత్‌లో ఉంది. దీంతో ఈ జంట కర్వాచౌత్ వేడుకల్ని వీడియో కాల్ ద్వారా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఈ క్రేజీ కపుల్స్ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 2020 డిసెంబర్లో యూట్యూబర్, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీని వివాహమాడారు. అప్పటి నుంచి ఈ జంట సామాజిక మాధ్యమాల్లో రొమాంటిక్ కపుల్‌గా పేరుతెచ్చుకున్నారు. భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు.