Dhanashree Verma | టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) దంపతులు విడాకులు (divorce) తీసుకున్న విషయం తెలిసిందే. చాహల్‌తో విడాకుల అనంతరం ధనశ్రీపై సోషల్ మీడియా వేదికగా అనేక ట్రోలింగ్స్ వచ్చాయి. తనపై వచ్చిన అసత్య ప్రచారాలపై ధనశ్రీ వర్మ తాజాగా స్పందించారు.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనశ్రీ మాట్లాడుతూ.. ఒకరిని అణగదొక్కాలని చూడటం తన నేచర్ కాదని చెప్పారు. ఇలా చేస్తే జీవితంలో ఎదగలేమన్నారు. క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతాలే తనను ముందుకు నడిపిస్తాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరీర్‌పైనే పెట్టినట్లు తెలిపారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో మళ్లీ ప్రేమలో పడటం (looking for love again) గురించి కూడా ధనశ్రీ స్పందించారు. ‘ప్రేమ గురించి మనం ఎవరం ముందుగానే ప్లాన్ చేసుకోలేము. ఈరోజు లేదా సంవత్సరం తర్వాత అయినా నేను ప్రేమలో పడతాను అని మనం ముందుగా నిర్ణయించుకోము. ప్రేమ అనేది చాలా భిన్నమైన విషయం. నా జీవితంలో మంచి రాసి పెట్టి ఉంటే అది ఎందుకు జరగదు..? జీవితంలో ప్రేమను ఎవరు కోరుకోరు..? ప్రస్తుతం నేను నా పని, కెరీర్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టాను’ అంటూ ధనశ్రీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
దంత వైద్యురాలైన ధనశ్రీ 2020 డిసెంబర్ 22న చాహల్‌ను వివాహం చేసుకుంది. కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు. అయితే, ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలు విడాకులకు దారి తీశాయి. 2020లో వీరి వివాహం జరగగా 2022 నుంచే ఈ ఇద్దరూ విడివిడిగా ఉంటున్న ఈ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ ఏడాది మార్చి 20న వీరికి విడాకులు మంజూరయ్యాయి. భరణం కింద చాహల్.. ధనశ్రీకి రూ. 4.75 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించగా అందులో ఇప్పటికే రూ. 2.37 కోట్లు చెల్లించినట్టు సమాచారం.
Also Read..
Bihar Elections | మూడు దశల్లో బీహార్ ఎన్నికలు..?
Anna University | అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసులో సంచలన తీర్పు.. దోషికి 30 ఏళ్ల జైలు శిక్ష
Telangana Statehood Day | తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని