Dhanashree Varma : భారత క్రికెటర్ యజ్వేంద్ర చాహల్తో ప్రేమ, పెళ్లి.. ఆపై నాలుగేళ్లకు విడాకులతో వార్తల్లో నిలిచింది ధనశ్రీ వర్మ (Dhanashree Varma). పరస్పర అంగీకారంతో విడిపోయిన ఈ ఇద్దరూ ఈమధ్య తరచూ వైరలవుతున్నారు. అయితే.. విడాకుల కారణంగా ధనశ్రీకి చాహల్ పెద్ద మొత్తం ‘భరణం’ (Alimony)గా చెల్లించాడనే కథనాలు వినిపిస్తున్నాయి. ఏకంగా రూ.60 కోట్లను ఆమెకు ముట్టజెప్పాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న తప్పుడు వార్తలను ధనశ్రీ ఖండించింది. ఇదివరకే భరణం తీసుకోవడాన్ని వ్యతిరేకించి విమర్శలపాలైన ఈ కొరియోగ్రాఫర్.. తాజాగా ‘రైజ్ అండ్ ఫాల్’ అనే ఎపిసోడ్లో రూ.60 కోట్ల ప్రచారంపై స్పందించింది.
కరోనా సమయంలో ఆరు నెలలకు పైగా ప్రేమాయాణం నడిపిన చాహల్, ధనశ్రీ పెళ్లితో ఒక్కటయ్యారు. చూడముచ్చటైన జంటగా నిలుస్తారనుకుంటే నాలుగేళ్లకే తాము కలిసి ఉండలేం అని విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఈ ఇద్దరి వ్యక్తగత జీవితంపై మీడియా ఫోకస్ మరింత ఎక్కువైంది. ధనశ్రీకి భరణంగా చాహల్ రూ.60 కోట్లు చెల్లించాడనే వార్తలు తెగ వినిపించాయి. దాంతో.. అవన్నీ అవాస్తవాలేనని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పిందీ డ్యాన్సర్.
Dhanashree Varma & Y Chahal.
Marriage Date – 22/10/20.
Divorce Date – 09/01/25.Duration of Cohabitation – 1479 days.
Settlement Amount – 60cr.
Calculated Per Day – 60cr ÷ 1479 days = ₹405679/- Per Day.Present Booming Business in the World…???!!! pic.twitter.com/GnPv6o4sFf
— ~ Mr_Perfect ~ (@HadkulaTiger1) February 22, 2025
‘నేను, చాహల్ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. కానీ, నేను ఏమీ మాట్లాడడంవ లేదని భరణం గురించి ఎవేవో కథనాలు వ్యాపింపజేస్తున్నారు. నాకు నచ్చిన విషయాలపై దృష్టి సారించాలని అమ్మానాన్న సూచించారు. అయినా.. జనాలకు ఇవన్నీ చెప్పి సమయం వృథా చేసుకోవడం నాకు నచ్చదు. ఇక భరణం విషయానికొస్తే అది నాకు అవసరం లేదు. కానీ, నేను రూ. 60 కోట్లు డిమాండ్ చేశానని అందరూ అనుకుంటున్నారు.
Rise and Fall के Set पर क्यों रोईं Dhanashree
Dhanashree Verma’s Emotional Breakdown: Mocked for Personal Life, Threatens to Quit Show! Ahana Kumra’s Divorce Jab Sparks Drama#DhanashreeVerma #YuzvendraChahal #AhanaKumra #RiseAndFall #BollywoodDrama #DivorceControversy pic.twitter.com/vBW3d3kVA0— Aap Ki Khabar (@aapkikhabarnews) September 22, 2025
కానీ, ఇవన్నీ నిరాధారమైనవి. నేను అంత మొత్తాన్ని డిమాండ్ చేయలేదు. పైగా చాహల్ నుంచి నాకు ఇంతమొత్తం ఇస్తామని సందేశం కూడా రాలేదు. ఈ విషప్రచారం నిజం కాదు. బాధ్యతలేని సంస్థలు తమ ప్రయోజనం కోసం కుటుంబాలను వివాదాల్లోకి లాగుతుంటాయి. ఇలాంటి వార్తలు హానిచేస్తాయి. అందుకే మీడియాను నేను కోరేది ఒక్కటే. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి’ అని ధనశ్రీ వర్మ సున్నితంగా హెచ్చరించింది.