Perth Wicket : యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. పెర్త్ వికెట్ (Perth Wicket) మీద ఒక్క రోజే 19 వికెట్లు పడడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగియడంతో ‘ఇదేమీ పిచ్’.. ‘అత్యంత చెత్త పిచ్’ అని ఫ్యాన్స్ విమర్శించారు. అయితే.. ఐసీసీ రిఫరీ మాత్రం వికెట్‌కు ఢోకా లేదంటున్నాడు. తాజాగా రిఫరీ రంజన్ మధుగల్లే (Ranjan Madugalle) పెర్త్ వికెట్‌కు ఏకంగా ‘వెరీ గుడ్’ అని రేటింగ్ ఇచ్చాడు.
సుదీర్ఘ ఫార్మాట్లో పిచ్‌లపై చర్చ జరగడం ఇదేమీ కొత్తకాదు. ఐదు రోజులు జరగాల్సిన టెస్టు మ్యాచ్.. రెండు మూడు రోజుల్లోనే ముగిసిందంటే పిచ్‌పై విమర్శలు వెల్లువెత్తుతాయి. అలాంటప్పుడు వార్తల్లో నిలిచిన అలాంటి వికెట్‌కు.. ఐసీసీ రేటింగ్స్ ఇస్తుంది. మామూలుగా ముగియడ ఐసీసీ నాలుగు రేటింగ్స్ ఇస్తుంది. ‘చాలా బాగుంది’, ‘బాగుంది’, ‘పర్లేదు’, ‘అధ్వాన్నం’ అని రేటింగ్స్ ప్రకటిస్తుంది. ఇటీవలే పెర్త్ వికెట్‌పై ఆరోపణలు వచ్చిన వేళ చాలా బాగుంది అని రిఫరీ రంజన్ మధుగల్లే రేటింగ్ ఇచ్చాడు.
The Perth pitch, where the 1st Ashes Test ended in two days, received the ICC’s highest rating of ‘Very Good’. pic.twitter.com/ytlXakGp02
— CricTracker (@Cricketracker) November 27, 2025
‘పెర్త్ వికెట్‌కు రిఫరీ వెరీ గుడ్ అని రేటింగ్ ఇవ్వడం చాలా సంతోషం. బ్యాటర్లకు, బౌలర్లకు సమంగా అనుకూలించేలా వికెట్‌ను రూపొందించాం. కానీ, ఇరుజట్ల పేసర్లు అత్యుత్తమ బౌలింగ్‌తో చెలరేగగా రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది. అయితే.. చివరి మూడు రోజలకు టికెట్లు కొన్న అభిమానులు నిరాశ చెందారు. కానీ, రెండు రోజుల్లో భారీగా ప్రేక్షకులు స్టేడియానికి వచ్చారు. ఈ సమ్మర్ అంతా ఇలానే స్టేడియాలు కిక్కిరిసిపోవాలని కోరుకుంటున్నా’ అని జేమ్స్ అల్సాప్ వెల్లడించాడు.
Best figures in Test cricket ✅
A spectacular catch ✅
3rd 10-wicket haul in Tests ✅No wonder Mitchell Starc was named player of the match in the Perth Test #Ashes2025 pic.twitter.com/DBr5gn6NY7
— Cricbuzz (@cricbuzz) November 22, 2025
యాషెస్‌లో తొలి మ్యాచ్ అయిన పెర్త్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జయభేరి మోగించింది. మిచెల్ స్టార్క్ (7-58), స్కాట్ బొలాండ్(4-33)లు విజృంభించగా.. ఇంగ్లండ్ నిర్దేశించిన 205 పరుగుల ఛేదనలో ట్రావిస్ హెడ్(123) విధ్వంసక శతకంతో జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. ఇంగ్లండ్, ఆసీస్ మధ్య రెండో టెస్టు బ్రిస్బేన్‌లో డిసెంబర్ 4 నుంచి జరుగనుంది.