Hockey Test Series | హాకీ టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి.. ఆకాశ్‌దీప్ సింగ్ హ్యాట్రిక్ వృథా
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా
Hockey Test Series : ఆస్ట్రేలియాతో జరుగుతున్న హాకీ టెస్ట్ సిరీస్‌ను భారత్ ఓటమితో ఆరంభించింది. అడిలైడ్‌లో శనివారం హోరాహోరిగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4-5 గోల్స్‌తో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇండియా ఫ్లార్వర్డ్ ప్లేయర్ ఆకాశ్‌దీప్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఒక గోల్ కొట్టాడు. అయితే, ఆస్ట్రేలియా ఆటగాడు బ్లేక్ గ్రోవర్స్ 60వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. దాంతో, ఆస్ట్రేలియా 5-4 గోల్స్‌తో విజేతగా నిలిచింది.
ఆకాశ్‌దీప్ మ్యాచ్ ఆరంభమైన 9వ నిమిషంలో తొలి గోల్ కొట్టాడు. ఆ తర్వాత 26వ, 58వ నిమిషంలో మరో రెండు గోల్స్ కొట్టి హ్యాట్రిక్ సాధించాడు. దాంతో ఇరుజట్ల స్కోర్ 4-4తో సమం అయింది. దాంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది అనిపించింది. కానీ, 60వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఆస్ట్రేలియా సద్వినియోగం చేసుకుంది. దాంతో, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత, ఆస్ట్రేలియా జట్లు ఈ ఏడాది బర్మింగ్హమ్లో జరిగిన కామన్వెల్త్ ఫైనల్ తర్వాత మళ్లీ తలపడడం ఇదే మొదటిసారి. ఫైనల్లో ఆస్ట్రేలియా 7-0తో భారత్‌ను చిత్తు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

