DCW vs MIW : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ డబుల్ హెడర్‌కు మరికొన్ని నిమిషాల్లో తెరలేవనుంది. ఆరంభ పోరులో కంగుతిన్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) గెలుపే లక్ష్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో తలపడుతోంది. డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టె్న్ జెమీమా రోడ్రిగ్స్ బౌలింగ్ తీసుకుంది. డబ్ల్యూపీఎల్‌లో సారథిగా తొలి మ్యాచ్ ఆడుతున్న జెమీమా విజయంతో టోర్నీని మొదలెట్టాలని భావిస్తోంది.
తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసినా ఓటమిపాలైన ముంబైని గెలిపించాలని హర్మన్‌ప్రీత్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌తో ముంబై స్పిన్నర్ త్రివేణి వశిష్ట డబ్ల్యూపీఎల్‌లో అరంగేట్రం చేస్తోంది. నెలన్నరక్రితం ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్ సారథ్యంలో ఆడిన జోమీమా ఈసారి కెప్టెన్‌గా తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. మరి.. ఈ లీగ్‌లో విజయవంతమైన ముంబై కెప్టెన్ వ్యూహాల ముందు జెమ్మీ పాచికలు పారుతాయా? లేదా? అనేది మరో మూడు గంటల్లో తెలిసిపోనుంది.
🚨 Toss Update 🚨@DelhiCapitals elect to bowl against @mipaltan
Updates ▶️ https://t.co/aVKBHVKp7c #TATAWPL | #KhelEmotionKa | #MIvDC pic.twitter.com/6FfRT5aWLY
— Women’s Premier League (WPL) (@wplt20) January 10, 2026
ముంబై ఇండియన్స్ తుది జట్టు : అమేలియా కేర్, జి.కమలిని(వికెట్ కీపర్), నాట్ సీవర్ బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నికోలా కారీ, సంజీవన్ సంజన, అమన్‌జోత్ కౌర్, పూనమ్ ఖెమ్నర్, త్రివేణి వశిష్ట, షబ్నం ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు : షఫాలీ వర్మ, లారా వొల్వార్డ్త్, జెమీమా రోడ్రిగ్స్(కెప్టెన్), లిజెల్లె లీ(వికెట్ కీపర్), మరినే కాప్, నిక్కీ ప్రసాద్, చినెల్లె హెన్రీ, స్నేహ్ రానా, మిన్ను మణి, శ్రీ చరణి, నందని శర్మ.
ఆరంభ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు షాకిచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సంజీవన సంజన(45) మెరుపులతో భారీ స్కోర్ చేసిన ఆఖరి ఓవర్ థ్రిల్లర్‌లో ఓడిపోయింది. 155 పరుగుల ఛేదనలో 65కే సగం వికెట్లు పడినా.. నదినే డీక్లెర్క్(63 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌తో బెంగళూరును గెలిపించింది. ఆఖరి ఓవర్లో 18 రన్స్ అవసరమవ్వగా వరుసగా 6, 4, 6, 4 బాదింది. దాంతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబైపై 3 వికెట్ల తేడాతో మంధాన సేన జయభేరి మోగించింది.