IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఓటమెరుగని ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మరో పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో తలపడుతోంది. టాస్ గెలిచిన కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ తీసుకున్నాడు. నాలుగు మ్యాచుల్లో ఓడిన ముంబైకి ఈ మ్యాచ్ కీలకం కానుంది.
టేబుల్ టాపర్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు ముంబై బ్యాటర్లు సిద్ధమవుతున్నారు. ఈ ఎడిషన్‌లో 210 పరుగుల లక్ష్యాన్ని ఊది పడేసిని ఢిల్లీ ముందు కొండంత టార్గెట్ పెట్టాలని హార్దిక్ పాండ్యా బృందం భావిస్తోంది.
🚨 Toss 🚨@DelhiCapitals won the toss and elected to bowl against @mipaltan in Delhi.
Updates ▶ https://t.co/sp4ar866UD#TATAIPL | #DCvMI pic.twitter.com/i7RqDJaMSB
— IndianPremierLeague (@IPL) April 13, 2025
ముంబై తుది జట్టు : రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధిర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్డ్, జస్ప్రీత్ బుమ్రా.
ఢిల్లీ తుది జట్టు : జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, అభిషేక్ పొరెల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్.