IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో చివరి ప్లే ఆప్స్ బెర్తు ఎవరిదో మరికాసేపట్లో తేలిపోనుంది. వాంఖడే వేదికగా తలపడుతున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)ను ఓడిస్తే నాకౌట్ పోరుకు దూసుకెళ్లనుంది. దాంతో, ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు అభిమానులను అలరించనుంది. ఈమ్యాచ్కు అక్షర్ పటేల్ అందుబాటులో లేకపోవడంతో ఫాఫ్ డూప్లెసిస్ ఢిల్లీకి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. టాస్ గెలిచిన డూప్లెసిస్ ఛేదనకే మొగ్గు చూపాడు. తమ కంచుకోటలో చెలరేగిపోయేందుకు ముంబై బ్యాటర్లు సిద్ధమవుతున్నారు.
పద్దెనిమిదో సీజన్లో వాంఖడేలో ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించింది ముంబై. బ్యాటింగ్, బౌలింగ్.. రెండు విభాగాలు అదరగొడుతున్న వేళ పాండ్యా బృందం ఢిల్లీకి చెక్ పెట్టాలని భావిస్తోంది. పవర్ ప్లేలో ముంబై హిట్టర్లను కట్టడి చేసేందుకు ఢిల్లీ పేసర్లు ముస్తాఫిజుర్, ముకేశ్ కుమార్, చమీరలు చెమటోడ్చాల్సిందే.
ముంబై తుది జట్టు : రియాన్ రికెల్టన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధిర్, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా.
ఇంప్యాక్ట్ సబ్స్ : కరన్ శర్మ, కార్బిన్ బాస్చ్, రాజ్ బవ, అశ్వనీ కుమార్, సత్యనారాయణ రాజు.
🚨 Toss 🚨@DelhiCapitals won the toss and elected to bowl against @mipaltan in Mumbai.
Updates ▶️ https://t.co/fHZXoEKt3L#TATAIPL | #MIvDC pic.twitter.com/xEvuPMF07X
— IndianPremierLeague (@IPL) May 21, 2025
ఢిల్లీ తుది జట్టు : డూప్లెసిస్(కెప్టెన్), అభిషేక్ పొరెల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారి, కుల్దీప్ యాదవ్, దుష్మంత్ చమీర, ముస్తాఫిజుర్, ముకేశ్ కుమార్.
ఇంప్యాక్ట్ సబ్స్ : కేఎల్ రాహుల్, సెదికుల్లా అటల్, కరున్ నాయర్, త్రిపురన విజయ్, మన్వంత్ కుమార్.