WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2026) నాలుగో సీజన్లో రెండో విజయంతో మురిసిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసక ఓపెనర్ లిజెల్లీ లీ (Lizelle Lee)కి భారీ జరిమానా పడింది. డబ్ల్యూపీఎల్ కోడ్ ఉల్లంఘించినందుకు ఆమెకు మ్యాచ్ ఫీజులో కోత విధించారు. టీవీ అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫీల్డ్ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు లీ మ్యాచ్ ఫీజులో 10 శాతం వేటు పడింది.
అసలేం జరిగిందంటే.. వడోదరలో మంగళవారం ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 155 పరుగుల ఛేదనలో లిజెల్లీ లీ() దూకుడుగా ఆడింది. తొలి వికెట్‌కు షఫాలీ వర్మ(Shafali Varma)తో కలిసి 63 రన్స్ జోడించిన తను.. అర్ధ శతకానికి చేరువైంది. కానీ, అమన్‌జోత్ కౌర్ వేసిన 11వ ఓవర్లో అనూహ్యంగా వికెట్ కీపర్ ఫిర్దౌసీ ఆమెను స్టంపౌట్ చేసింది.
OUT or NOT OUT 🧐
– Lizelle Lee got Frustrated with this decision 😨 pic.twitter.com/hEZokK6SF4
— Richard Kettleborough (@RichKettle07) January 20, 2026
అయితే.. లీ మాత్రం తన పాదం క్రీజులో ఉంది కాబట్టి రిప్లే అనంతరం నాటౌట్‌గా ప్రకటిస్తారని భావించింది. రీప్లేను, స్టంప్స్ కెమెరాను సుదీర్ఘ సమయం పరిశీలించిన టీవీ అంపైర్ చివరకు ఆమెను ఔట్‌గా ప్రకటించారు. దాంతో.. షాక్‌కు గురైన లీ ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగింది. తాను ఔట్ కాదని.. తన పాదం క్రీజులోనే ఉందని వాదించింది. అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మైదానంలోనే ఆమె నిరసన తెలిపింది.
🚨 WPL update 🚨
Lizelle Lee has been fined 10% of her match fee and given 1 demerit point for a Code of Conduct breach during DC vs MI in Vadodara.
For context, Lee was not happy with her stumping dismissal… 👀 pic.twitter.com/SIUiMNiM3Y
— Cricbuzz (@cricbuzz) January 21, 2026
డబ్ల్యూపీఎల్ నియమనిబంధనల్లోని అర్టికల్ 2.2 ప్రకారం లెజెల్లీ లెవల్ 1 తప్పిదానికి పాల్పడింది. లీగ్ కోడ్ ఉల్లంఘించినందున ఆమెపై రిఫరీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. దాంతో.. విచారణ సందర్భంగా లీ తన పొరపాటును అంగీకరించింది. దాంతో.. మొదటి పొరపాటుగా పరిగణిస్తూ.. ఆమెకు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. ఈ మ్యాచ్‌లో 28 బంతుల్లోనే 46 పరుగులతో ఢిల్లీకి శుభారంభమిచ్చింది లీ. అనంతరం కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(51 నాటౌట్) సంచలన బ్యాటింగ్‌తో ఢిల్లీని గెలిపించింది.