కోల్‌కతా: ఓపెనర్ కేఎల్ రాహుల్ (30 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 60) మెరుపులకు తోడు బౌలింగ్‌లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (3/29), పేసర్ లుంగి ఎంగిడి (3/27) సత్తా చాటడంతో ఐపీఎల్ 19వ సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. ఆదివారం రాత్రి జరిగిన లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో 40 రన్స్ తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించింది.
ముంబైని ఓడించిన రాజస్థాన్ నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకోవడంతో నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 203/5 స్కోరు చేసింది. రాహుల్ అర్ధ శతకంతో సత్తా చాటాడు. మంచి షాట్లతో తన ఫామ్‌ను కొనసాగించిన అతను కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు.
అభిషేక్ పోరెల్ ( 22) తొలి వికెట్‌కు 40 రన్స్, వన్‌డౌన్‌లో వచ్చిన సాహిల్ పరాఖ్ ( 24) రెండో వికెట్‌కు 47 పరుగులు జోడించి భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఆ తర్వాత కెప్టెన్ అక్షర్ పటేల్ ( 39) జతగా కేఎల్ ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో పాటు స్కోరు 100 దాటించాడు. చివరో మిల్లర్ (28), అశుతోష్ శర్మ (18 నాటౌట్) వేగంగా ఆడటంతో ఢిల్లీ స్కోరు 200 దాటింది. సౌరభ్ దూబే (2/28) రెండు వికెట్లతో సత్తా చాటాడు.
అనంతరం ఆతిథ్య కేకేఆర్ 18.4 ఓవర్లలో 163 రన్స్‌కే ఆలౌటై ఓడిపోయింది. కెప్టెన్ అజింక్యా రహానే (39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63)తో పాటు ఫిన్ అలెన్ (20), మనీశ్ పాండే (24) రాణించడంతో ఓ దశలో 128/3తో మెరుగైన స్థితిలో నిలిచిన కేకేఆర్.. కుల్దీప్ దెబ్బకు వరుస వికెట్లు కోల్పోయి డీలా పడింది. గ్రీన్ (2), రింకూ (0), తేజస్వి దహియా (1) ఫెయిల చివర్లో రోవ్‌మన్ పావెల్ (29) పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి. కుల్దీప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఢిల్లీ: 20 ఓవర్లలో 203/5 (రాహుల్ 60, అక్షర్ 39, సౌరభ్ దూబే 2/28);
కోల్‌కతా: 18.4 ఓవర్లలో 163 ఆలౌట్ (రహానే 63, కుల్దీప్ 3/29, ఎంగిడి 3/27)