ఢిల్లీ: ఐపీఎల్లో ఇంతవరకూ ట్రోఫీ నెగ్గని జట్లలో ఒకటైన ఢిల్లీ క్యాపిటల్స్ 2025 సీజన్‌కు కొత్త హెడ్‌కోచ్‌ను నియమించుకుంది. భారత మాజీ క్రికెటర్ హేమాంగ్ బదానీ ఆ జట్టుకు వచ్చే సీజన్ నుంచి చీఫ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక బదానీ ఐపీఎల్‌తో పాటు పలు ఇతర లీగ్‌లలో జట్లకు బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. కాగా ఆంధ్రాకు చెందిన మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావు ఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమితుడయ్యాడు. భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీని జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమిస్తున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ఒక ప్రకటనలో తెలిపింది.