Delhi Capitals : మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) కొత్త కెప్టెన్‌ను ఎంచుకుంది. తమకు భారత క్రికెటరే నాయకురాలిగా కావాలనే ఉద్దేశంతో టీమిండియా స్టార్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues)కు ప్రమోషన్ ఇస్తూ కెప్టెన్‌గా నియమించింది. జెమీమాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్న స్పెషల్ వీడియోను ఢిల్లీ ఫ్రాంచైజీ ఎక్స్ పోస్ట్‌లో పెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ ప్లేయరైన జెమీమా రోడ్రిగ్స్‌కు కెప్టెన్సీ అప్పగిస్తున్న విషయాన్ని అచ్చం సినిమా స్టయిల్లో వెల్లడించారు. సోమవారం ఒక సూట్‌కేస్‌ను డెలివరీ చేస్తున్న వీడియో పెట్టిన ఫ్రాంచైజీ.. డిసెంబర్ 23న సాయంత్రం 6 గంటలకు బిగ్ అనౌన్స్మెంట్ అలర్ట్ అని క్యాప్షన్ రాసింది. మంగళవారం కూడా ఆ సూట్‌కేస్ ఫొటోతో.. స్పెషల్ డెలివరీ ఈరోజు సాయంత్రం 6 గంటలకు అని పోస్ట్ పెట్టింది ఫ్రాంచైజీ. అనంతరం కెప్టెన్సీ రివీలింగ్ వీడియో షేర్ చేసింది. అందులో.. ఒక షూట్ కోసమని మా మార్కెటింగ్ టీమ్ డిసెంబర్ 14న జెమీమాను పిలిచింది. సో.. ఆరోజు ఉదయం 9:25కి ఆమె షూట్ లొకేషన్‌కు వచ్చింది. అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఉందని మా టీమ్ జెమీమాకు చెప్పింది.
She never lost faith, she never feared and she’s just getting started 💙❤️ pic.twitter.com/UPCuHKbPEs
— Delhi Capitals (@DelhiCapitals) December 23, 2025
అనంతరం మేకప్‌మెన్, స్టయిలిస్ట్ జెమీమాను మీటింగ్‌కు రెఢీ చేశారు. ఆ తర్వాత అభిమానులను చూసేందుకు జెమీమా బోర్డ్రూమ్లోకి వెళ్లింది. అప్పుడు ఆ గదిలో లైట్స్ ఆఫ్ అయి.. బిగ్ స్క్రీన్ మీద ఆమె కుటుంబ సభ్యుల మెసేజ్‌లు మొదలయ్యాయి. ఆమె తండ్రి, తల్లి, సోదరుడు జెమ్మీ గురించి చెప్పడం పూర్తయ్యాక ఆఖర్లో సూట్‌కేస్‌తో పార్త్ జిందాల్ లోపలకి వస్తాడు. సూట్‌కేస్‌లోని జెర్సీని జెమీమాకు చూపించి.. నువ్వే కెప్టెన్ అని చెప్పగానే తను షాకవుతోంది. జెర్సీ ధరించి ఆమె ఫొటోలకు పోజివ్వడంతో వీడియో ముగుస్తుంది.
CAPTAIN ROCKSTAR IS HERE TO RULE ❤️🔥🎸 pic.twitter.com/1fl0NWEPaj
— Delhi Capitals (@DelhiCapitals) December 23, 2025
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్‌కు జెమీమా రోడ్రిగ్స్‌ను అట్టిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆమెకు కెప్టెన్సీ ఇవ్వనుందనే వార్తలు వినిపించాయి. ఢిల్లీలో వేలం సందర్భంగా ఢిల్లీ ఫ్రాంచైజీ సహ యజమాని పార్త్ జిందాల్ (Parth Jindal) మాట్లాడుతూ.. మా జట్టకు భారత క్రికెటర్ కెప్టెన్‌గా ఉండాలనే విషయంలో మేము స్పష్టంగా ఉన్నాం’ అని చెప్పాడు. దాంతో.. వేలంలో కొన్న దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్డ్త్ బదులు జెమీమాకే కెప్టెన్సీ ఇస్తారనే వార్తలకు బలం చేకూరింది.
డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున జెమీమా రోడ్రిగ్స్ నిలకడగా రాణిస్తోంది. వరల్డ్‌కప్ సెమీఫైనల్లో బలమైన ఆస్ట్రేలియాపై అజేయ శతకం(127 నాటౌట్)తో టీమిండియాను గెలిపించింది బ్యాటర్. పేలవ ఫామ్‌తో ఒక మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమైన తను.. ఆసీస్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడింది. మానసిక ఒత్తిడిని జయించి.. తానొక మ్యాచ్ విన్నర్ అని చాటుకుంది. మళ్లీ టచ్‌లోకి వచ్చిన ఈ ఈ స్టార్ ప్లేయర్‌ను డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ కోసం ఢిల్లీ రూ.2.2 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఢిల్లీ విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్న జెమీమా ఇప్పటివరకూ 27 మ్యాచుల్లో 139.66 స్ట్రయిక్ రేటుతో 507 పరుగులు చేసింది.
𝗕𝗶𝗴 𝗔𝗻𝗻𝗼𝘂𝗻𝗰𝗲𝗺𝗲𝗻𝘁 𝗔𝗹𝗲𝗿𝘁 💼👀
Coming your way on 23 December, at 6 PM, on @StarSportsIndia and @JioHotstar 📺 pic.twitter.com/Ucuf0OPIe5
— Delhi Capitals (@DelhiCapitals) December 22, 2025