Prithvi Shaw : రంజీలకే పరిమితమైన భారత క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) ఐపీఎల్లో పునరామనం చేయనున్నాడు. మంగళవారం అబుధాబీలో జరిగిన మినీ వేలంలో ఈ విధ్వంసక క్రికెటర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనేసింది. తొలి రౌండ్లో అతడిని వద్దనుకున్న ఢిల్లీ.. రెండో రౌండ్లో రూ. 75 లక్షల కనీస ధరకు మళ్లీ సొంత గూటికి చేర్చుకుంది. దాంతో.. ఇటీవల రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దంచేసిన షా.. మరోసారి ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరించనున్నాడు.
ఐపీఎల్లో తుఫాన్ ఇన్నింగ్స్‌లతో వైరలైన పృథ్వీ షా.. పదిహేడో సీజన్ తర్వాత అడ్రసే లేకుండా పోయాడు. ఫామ్ లేమితో ఇబ్బందిపడిన ఈ యంగ్‌స్టర్‌ను పద్దెనిమిదో సీజన్లో ఎవరూ కొనలేదు. సో.. దేశవాళీ క్రికెట్లో పరుగుల వరదతో 19వ సీజన్‌కోసం పేరు నమోదు చేసుకున్నాడు షా. అబుధాబీలో వేలం మొదలైన కాసేపట్లోనే పృథ్వీ పేరు వచ్చినా.. ఏ జట్టు కొనేందుకు ఆసక్తి చూపించలేదు. దాంతో.. ఇక మనోడి పనైపోయిందనకున్నారు అభిమానులు. కానీ, అనూహ్యంగా రెండో దఫాలో అతడిని ఢిల్లీ క్యాపిటల్సే రూ.75 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. అంతే.. ‘హమ్మయ్య’ అని ఊపిరిపీల్చుకున్నాడీ క్రికెటర్. అయితే.. 2025లో రూ.8 కోట్లు పలికిన ఈ ముంబై బ్యాటర్ ఈసారి ఇంత తక్కువ ధరకు ఆడాల్సి రావడం ఒకింత బాధాకరమే.
WELCOME BACK, PRITHVI SHAW!!! 💙❤️ pic.twitter.com/y4Iepd3h6k
— Delhi Capitals (@DelhiCapitals) December 16, 2025
సచిన్ వారసుడు, మరో సెహ్వాగ్.. ఇలా క్రీడా దిగ్గజాల ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా కెరీర్ చూస్తుండగానే తలకిందులైంది. ఎంతో ప్రతిభగల అతడు జట్టుకు దూరమవ్వడమే కాదు.. దేశవాళీలోనూ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ చిన్నప్పటి కోచ్ దినేశ్ లాడ్ (Dinesh Lad) ఒక పాడ్‌కాస్ట్ షోలో షా వైఫల్యానికి కారణాలను విశ్లేషించాడు. ‘నేను పృథ్వీ షాను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. పదేళ్లకే అతడు ప్రతిభగల క్రికెటర్‌గా అవతరించాడు. కానీ, అనూహ్యంగా కెరీర్‌ను సందిగ్ధంలో పడేసుకున్నాడు. ఎవరి భవిష్యత్ అయినా వారి చేతుల్లోనే ఉంటుంది.
My boy Prithvi Shaw is BACK in DC! 🔥 Other DC fans hate him and blame him for many reasons, but I personally love him ❤️
It’s time to rewrite your career, Shaw 😭⚡ pic.twitter.com/LsbbWsrqTx
— 𝐕♛ (@DelhiKaKing18) December 16, 2025
టీనేజ్ సంచలనంగా 2018లో టెస్టు అరంగేట్రం చేశాడు షా. వెస్టిండీస్‌పై రాజ్‌కోట్‌లో బరిలోకి దిగిన ఈ హిట్టర్ సెంచరీతో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. అయితే.. ఆ తర్వాత అదే జోరు చూపలేక నాలుగేళ్లకే జట్టులో చోటు కోల్పోయాడు. అనంతరం ఐపీఎల్, దేశవాళీలో పరుగుల వరద పారించిన పృథ్వీ.. పునరాగమనం చేయలేకపోయాడు. అప్పటికే ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్ జట్టులోకి రావడంతో షాకు దారులు మూసుకుపోయిన విషయం తెలిసిందే.