PAK vs IRE : టీ20 వరల్డ్ కప్ ఆఖరి మ్యాచ్‌లో పాకిస్థాన్ (Pakistan) బౌలర్లు నిప్పులు చెరిగారు. ప్రధాన పేసర్ షాహీన్ ఆఫ్రిది(3/22) విజృంభణతో ఐర్లాండ్ (Ireland) బ్యాటర్లను వణికించాడు. అతడి ధాటికి ఒకదశలో 50లోపే చాప చుట్టేస్తుందనకున్న ఐర్లాండ్‌కు టెయిలెండర్లు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. డెలానీ (31), జోషు లిటిల్(22 నాటౌట్) అసమాన పోరాటంతో ఐరిష్ జట్టు.. పాక్‌కు 107 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఫ్లోరిడాలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బాబర్ ఆజాం ఐర్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆఫ్రిది తొలి ఓవర్లోనే రెండు వికెట్లతో అదరగొట్టాడు. ఓపెనర్ ఆండ్రూ బాల్బిరినే(0), లొర్కాన్ టక్కర్(2)లను వెనక్కి పంపడంతో ఐర్లాండ్ కోలుకోలేకపోయింది. ఆ తర్వాత అమిర్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్(1) వికెట్ తీయగా.. పవర్ ప్లేలోనే 5 వికెట్లు కోల్పోయింది.
ఆ దశలో గెరాత్ డెలానీ(31), మార్క్ అడైర్(15)లు పట్టుదలగా ఆడారు. షాదాబ్, అబ్బాస్ ఓవర్లలో భారీ షాట్లు ఆడి స్కోర్ బోర్డును నడింపించారు. ఏడో వికెట్‌కు 44 రన్స్ జోడించి ఐర్లాండ్ పరువు కాపాడారు. వీళ్ల తర్వాత జోషు లిటిల్(22 నాటౌట్), బెంజమిన్ వైట్(5 నాటౌట్)తో ఆఖరి వికెట్‌కు భాగస్వామ్యం నిర్మించాడు. దాంతో, ఐర్లాండ్ 9 వికెట్ల నష్టానికి 106 రన్స్ చేయగలిగింది.