కోల్‌కతా: రంజీ ట్రోఫీ సీజన్ 2024-25లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై సెమీఫైనల్‌కు చేరింది. హర్యానాతో జరిగిన మూడో క్వార్టర్స్ మ్యాచ్‌లో ముంబై.. 152 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తుచేసి సెమీస్‌కు అర్హత సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు సారథి రహానే (108) సెంచరీతో చెలరేగడంతో ముంబై 339 పరుగులకు ఆలౌట్ అయి హర్యానా ఎదుట 354 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో హర్యానా 201 రన్స్‌కే కుప్పకూలింది. రోయ్స్టన్ (5/39) ఐదు వికెట్లతో చెలరేగగా సీనియర్ పేసర్ శార్దూల్ ఠాకూర్ (3/26) రాణించాడు. తమిళనాడుతో జరిగిన రెండో క్వార్టర్స్ మ్యాచ్‌లో విదర్భ 198 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. విదర్భ నిర్దేశించిన 401 పరుగుల ఛేదనలో తమిళనాడు 202 పరుగులకే ఆలౌట్ అయింది. సెమీస్‌లో విదర్భ.. ముంబైతో తలపడనుంది. నాలుగో క్వార్టర్స్ పోరులో సౌరాష్ట్రపై గుజరాత్ ఇన్నింగ్స్ 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జమ్ముకశ్మీర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేరళ.. 399 పరుగుల ఛేదనలో 100/2 స్కోరు చేసింది.