Australia Open 2024: అమెరికా యువ సంచలనం, నాలుగో సీడ్ కోకో గాఫ్‌కు ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారీ షాక్ తగిలింది. సెమీస్ వరకూ అప్రతిహాత విజయాలతో సాగిన గాఫ్ పోరాటం తుది మెట్టుకు ముందే ఆగిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్, రెండో సీడ్ అరీనా సబలెంకతో ముగిసిన మ్యాచ్‌లో గాఫ్‌కు ఓటమి తప్పలేదు. గురువారం మెల్బోర్న్లోని రాడ్లీవర్ ఎరీనా వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లో గాఫ్.. 6-7 (2-7), 4-6 తేడాతో సబలెంక చేతిలో ఓడిపోయింది. మరో సెమీస్‌లో చైనాకు చెందిన 21 ఏండ్ల అమ్మాయి, 12వ సీడ్ కెన్విన్ జెంగ్.. 6-4, 6-4 తేడాతో డయానా యస్త్రమ్స్క (ఉక్రెయిన్)ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.
తాజా విజయంతో సబలెంక.. గతేడాది యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌లో గాఫ్‌పై ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నట్టైంది. ఆమెకు ఆస్ట్రేలియా ఓపెన్‌లో వరుసగా ఇది రెండో ఫైనల్. తద్వారా 2016, 2017 తర్వాత వరుసగా రెండేండ్లు ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరిన క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.
The dream of back-to-back #AusOpen titles remains alive for @SabalenkaA!
The reigning champion sees off the challenge of Coco Gauff 7-6(2) 6-4.
See you on Saturday, Aryna!#AusOpen • @wwos • @espn • @eurosport • @wowowtennis pic.twitter.com/BpvcHueznC
— #AusOpen (@AustralianOpen) January 25, 2024
ఇక మరో సెమీస్‌లో జెంగ్.. కెన్విన్పై అలవోక విజయంతో ఫైనల్ చేరుకుంది. సరిగ్గా పదేండ్ల క్రితం 2014లో చైనాకు చెందిన లి నా తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరిన రెండో చైనా క్రీడాకారిణిగా ఆమె రికార్డులకెక్కింది. జెంగ్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్. సబలెంకతో ముఖాముఖి తలపడటం జెంగ్‌కు ఇది రెండోసారి మాత్రమే. గతేడాది క్వార్టర్ ఫైనల్స్‌లో ఈ ఇద్దరి మధ్య జరిగిన పోరులో సబలెంకనే విజయం వరించింది.
Through in two!
Qinwen Zheng wins her place in Saturday’s #AusOpen Women’s Singles final!
She defeats Dayana Yastremska 6-4 6-4 to set up a meeting with Aryna Sabalenka.#AusOpen • @wwos • @espn • @eurosport • @wowowtennis pic.twitter.com/jlKeIDwIIl
— #AusOpen (@AustralianOpen) January 25, 2024