INDW vs PAKW : భారత్ నిర్దేశించిన 248 పరుగుల ఛేదనలో పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మునీబా ఆలీ(2) అనూహ్యంగా రనౌటయ్యింది. క్రాంతి గౌడ్ బౌలింగ్‌లో చివరి బంతికి అలీ ఎల్బీ కోసం అప్పీల్ చేశారు భారత ప్లేయర్లు. కానీ, అంపైర్ ఇవ్వలేదు. కానీ, దీప్తి శర్మ మెరుపు వేగంతో బంతిని వికెట్లకు గురిచూసి కొట్టింది. అంతే.. మునీబా నిరాశగా పెవిలియన్ చేరింది. రిప్లేలో ఆమె ఎల్బీగా ఔట్ అయినట్టు తేలింది. ఒకవేళ టీమిండియా రివ్యూ తీసుకున్నా సరే తను కచ్చితంగా ఔటయ్యేదే. దాంతో.. ఆమె వికెట్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.
కొత్త బంతితో రేణుకా సింగ్, క్రాంతి గౌడ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నాలుగు ఓవర్లలో 6 రన్స్ చేసిన పాక్ మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన సిద్రా అమిన్ (8) రెండు బౌండరీలతో స్కోర్ 19కి చేరింది. 7 వర్లలో పాక్ వికెట్ నష్టానికి 20 రన్స్ చేసింది. ఇంకా దాయాది విజయానికి 228 పరుగులు కావాలి.
On target 🎯
A direct hit run-out from Deepti Sharma gives #TeamIndia an early breakthrough! 👏
Updates ▶ https://t.co/9BNvQl3bfB#WomenInBlue | #CWC25 | @Deepti_Sharma06 pic.twitter.com/WXVfwcsBU6
— BCCI Women (@BCCIWomen) October 5, 2025