IND vs BAN : 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు తొలి ఓవర్‌నే షాక్ తగిలింది. తొలి బంతికే ఓపెనర్ నజ్ముల్ హొసేన్ శాంటో ఔట్ అయ్యాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టడంతో అతను నిరాశగా వెనుదిరిగాడు. కెప్టెన్ లిట్టన్ దాస్ 1, అనాముల్ హక్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచిన బంగ్లదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడడంతో భారత జట్టు 186 పరుగులకు ఆలౌట్ అయింది. కేహెల్ రాహుల్ 74 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ 9, ధావన్ 7, శ్రేయాస్ 24 పరుగులు మాత్రమే చేశారు.