Deepa Karmakar | ఢిల్లీ: భారత స్టార్ జిమ్నాస్టిక్ క్రీడాకారిణి దీపా కర్మాకర్ సోమవారం ఈ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ క్రీడలో భారత్ తరఫున ఒలింపిక్స్ (రియో, 2016)లో పాల్గొన్న తొలి జిమ్నాస్ట్గా గుర్తింపు దక్కించుకున్న 31 ఏండ్ల దీపా.. సోమవారం ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించింది. ‘సుదీర్ఘ ఆలోచన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇది తేలికైనది కాదని తెలుసు. కానీ సరైన సమయంలోనే రిటైర్మెంట్ తీసుకున్నానని భావిస్తున్నా.
నా జీవితంలో జిమ్నాస్టిక్స్ ఓ భాగం. ఈ ఆటలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ ప్రతి క్షణానికి నేను ఎంతో కృతజ్ఞతతో ఉంటాను’ అని పేర్కొంది. 2018లో జరిగిన ఎఫ్ఐజీ వరల్డ్ చాలెంజ్ కప్లో స్వర్ణం సాధించిన దీపా ఈ పతకం గెలిచిన తొలి భారత జిమ్నాస్ట్గా చరిత్ర సృష్టించింది. రియో ఒలింపిక్స్లో 0.15 పాయింట్ల తేడాతో తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది.