IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌ను ఓటమితో ఆరంభించిన కోల్‌కతా నైట్ రైడర్స్ బోణీ కొట్టింది. స్వల్ప ఛేదనలో ఓపెనర్ క్వింటన్ డికాక్(97 నాటౌట్) అజేయ అర్ధ శతకంతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. మొదట బంతితో రాజస్థాన్ రాయల్స్‌ను కట్టడి చేసిన కోల్‌కతా ఆపై 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టర్నింగ్ అవుతున్న పిచ్‌పై ఓపెనర్ డికాక్ సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంప్యాక్ట్ ప్లేయర్ అంగ్క్రిష్ రఘువంశీ(18 నాటౌట్) సహకారంతో జట్టును గెలుపు దిశగా నడిపాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన 18వ ఓవర్లో 4, 6, 6 బాదిన డికాక్ కోల్‌కతాకు సూపర్ విక్టరీని కట్టబెట్టాడు. దాంతో, తొలి సీజన్ చాంపియన్ రాజస్థాన్‌కు వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది.
డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా పంజా విసిరింది. గువాహటిలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కేకేఆర్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ క్వింటన్ డికాక్(97 నాటౌట్ : 61బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) చివరిదాకా నిలబడి జట్టును గెలిపించాడు. స్వల్ప ఛేనదలో ఓపెనర్ మోయిన్ అలీ(5) వెనుదిరిగాక.. కెప్టెన్ అజింక్యా రహానే(18)లు వెనుదిరిగిన తన మార్క్ షాట్లతో చెలరేగాడు డికాక్. ఇంప్యాక్ట్ ప్లేయర్ అంగ్క్రిష్ రఘువంశీ(18 నాటౌట్) సాయంతో కోల్‌కతా స్కోర్‌బోర్డును నడిపించాడు. దాంతో, 11 ఓవర్లకు కోల్‌కతా 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. స్పిన్నర్లతో ఒత్తిడి పెంచే ప్రయత్నాన్ని తిప్పికొట్టిన ఈ లెఫ్ట్ హ్యాండర్. ఆర్చర్ బౌలింగ్లోవరుసగా 4, 6 బాది..మరో సిక్సర్‌తో రాజస్థాన్‌కు రెండో ఓటమి ఖాయం చేశాడు.
When QDK hits them, they stay hit! 🔥
An emphatic way to bring up his fifty in style 😎
Updates ▶ https://t.co/lGpYvw87IR#TATAIPL | #RRvKKR | @KKRiders pic.twitter.com/IscKaiMsNA
— IndianPremierLeague (@IPL) March 26, 2025
టాస్ ఓడిన రాజస్థాన్ ఇన్నింగ్స్ ఆది నుంచి తడబడుతూ సాగింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(13), సంజూ శాంసన్(29)లు శుభారంభమిచ్చినా స్పిన్నర్ల రాకతో వికెట్ల పతనం మొదలైంది. 3 ఓవర్లకే 28 పరుగులు రాబట్టిన ఈ జోడిని వైభవ్ అరోరా విడదీశాడు. శాంసన్ బౌల్డ్ అయ్యాక వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్ (25) ఉన్నంత సేపు బౌండరీతో విరుచుకపడ్డాడు. అతడికి చెక్ పెట్టేందుకు రహానే తమ అస్త్రం వరుణ్ చక్రవర్తికి బంతి అందించాడు. ఊహించినట్టే పరాగ్ వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్(33) ఒంటరి పోరాటం చేసి జట్టు స్కోర్ 130 దాటించాడు. అతడు ఔటయ్యాక పేసర్ జోఫ్రా ఆర్చర్(16) ధనాధన్ ఆడడంతో రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగలిగింది.