SAW vs BANW : మహిళల ప్రపంచ కప్ ఉత్కంఠ పోరాటాలతో రంజుగా సాగుతోంది. భారత్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన డీక్లెర్క్ (37 నాటౌట్) మరోసారి ఒత్తిడిలోనూ చెలరేగింది. చివరి ఓవర్ వరకూ విజయం దోబూచులాడిన పోరులో బంగ్లాదేశ్‌కు గుండెకోతను మిగిల్చుతూ సఫారీలను గెలిపించిందీ ఆల్‌రౌండర్. ఆఖరి ఓవర్లో 8 రన్స్ అవసరం కాగా.. ఫోరో, సిక్సర్‌తో దక్షిణాఫ్రికాకు మూడు వికెట్ల విజయాన్ని కట్టబెట్టిందీ ఫినిషర్. ఫామ్‌లో ఉన్న సఫారీ బ్యాటర్లను అద్బుతంగా నిలువరించిన బంగ్లా క్యాచ్‌లు వదిలేసే భారీ మూల్యం చెల్లించుకుంది.
వరల్డ్ కప్‌లో మరో ఆఖరి ఓవర్ థ్రిల్లర్. కానీ, విజయం మాత్రం దక్షిణాఫ్రికాదే. వైజాగ్‌లో భారత జట్టుపై మెరుపు అర్ధ శతకం బాది సఫారీలను గెలిపించిన డీ క్లెర్క్ (37 నాటౌట్) ఈసారి బంగ్లాదేశ్‌ను గెలుపు వాకిట దెబ్బకొట్టింది. ఆరంభం నుంచి పక్కాగాబౌలింగ్ చేస్తూ .. వికెట్ల వేటతో దక్షిణాఫ్రికా బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేసిన బంగ్లా స్పిన్నర్లు.. ఆఖరి వరకూ గొప్పగా బౌలింగ్ చేశారు. కానీ, ఫీల్డర్లు ట్రయాన్, డీక్లెర్క్ క్యాచ్‌లు వదిలేయడం ఆ జట్టు కొంపముంచింది. మరినే కాప్ (56), చోలే ట్రయాన్(62)లు అర్ధ శతకాలతో రాణించారు.
Another thriller in Visakhapatnam as Bangladesh push South Africa to the limit, only to encounter heartbreak in the end #CWC25
Scorecard: https://t.co/aK9P2NlYro pic.twitter.com/zdNc8KXMBW
— ESPNcricinfo (@ESPNcricinfo) October 13, 2025
పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన దక్షిణాఫ్రికా స్వల్ప లక్ష్య ఛేదనలో అపసోపాలు పడింది. వైజాగ్‌లో బంగ్లాదేశ్ స్పిన్నర్లు విజృంభించడంతో పరుగుల కోసం చెమటోడ్చారు సఫారీ బ్యాటర్లు 15వ ఓవర్లో లారా వొల్వార్డ్త్ (31) రనౌట్‌తో మొదలు.. ఆరు పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయింది సఫారీ జట్టు. బంగ్లా స్పిన్నర్ ఫాహిమా ఖాతూన్ తొలి బంతికే సినాలో జాఫ్తా(4)ను బౌల్డ్ చేసి ఐదో వికెట్ అందించింది. వరసగా వికెట్లు పడిన దశలో మరినే కాప్ (56), చొలే ట్రయాన్(62)లు ఓపికగా ఆడుతూ స్కోర్ బోర్డును నడిపించారు.
Cometh the hour, cometh De Klerk! 🔥
Twice in two games, Nadine De Klerk has held her nerve to take South Africa home! https://t.co/aK9P2NlYro pic.twitter.com/US2PlCy5zF
— ESPNcricinfo (@ESPNcricinfo) October 13, 2025
చకచకాగా సింగిల్స్ తీస్తూ.. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ మరినే, ట్రయాన్ స్కోర్ 130 దాటించారు. 40వ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో మరినే హాఫ్ సెంచరీ సాధించింది. 85 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన మరినే కాప్‌ను నహిదా పెవిలియన్ పంపింది. దాంతో.. 163 వద్ద ఆరో వికెట్ పడింది. రబెయా ఓవర్లో మిడ్‌వికెట్ బౌండరీ వద్ద సబ్ ఫీల్డర్ సుమైమా క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన ట్రయాన్ .. ఆ తర్వాతి బంతికి సిక్సర్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. దాంతో.. సమీకరణం 40 బంతుల్లో 43పరుగులకు చేరింది. ఆఖరి బంతికి బౌండరీతో ఆ16 రన్స్ రావడంతో సఫారీల జట్టు విజయానికి చేరువైంది. కానీ, క్విక్ సింగిల్ తీయబోయి ట్రయాన్ రనౌటయ్యింది. ఆ తర్వాత మసబతా క్లాస్ తోడుగా డీక్లెర్క్ పోరాడింది. 48వ ఓవర్లో డీక్లెర్క్ బౌండరీకి యత్నించగా క్యాచ్‌ను షొర్నా వదిలేసింది. అంతదరిలోనూ ఉత్కంఠ.. ఆఖరి ఓవర్లో 8 రన్స్ అవసరం కాగా.. తొలి బంతికే డీక్లెర్క్ బఫోర్ కొట్టింది. .. మూడో బంతిని స్టాండ్స్‌లోకి పంపడంతో మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది దక్షిణాఫ్రికా.
వరల్డ్ కప్‌లో బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతున్న బంగ్లాదేశ్ ఈసారి అదరగొట్టింది. దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్న టాపార్డర్ శుభారంభం ఇవ్వగా.. మిడిలార్డర్ బ్యాటర్లు రాణించారు. సఫారీల కట్టుదిట్టమై బౌలింగ్ కారణంగా ఒకదశలో స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యేలా కనిపించింది బంగ్లా. కానీ, షోర్నా అక్తర్(51 నాటౌట్), షమీన్ అక్తర్(50)లు అర్ధ శతకాలతో మెరవడంతో .. పోరాడగలిగే స్కోర్ చేసింది. డెత్ ఓవర్లలో రీతూ మోని(19 నాటౌట్)తో కలిసి షొర్నా బౌండరీలతో చెలరేగింది. వీరిద్దరూ అజేయంగా 27 జోడించగా.. బంగ్లా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది.