IPL 2021 | తడబడ్డ సన్‌రైజర్స్.. ఢిల్లీ ముందు స్వల్ప లక్ష్యం

DC vs SRH | ఢిల్లీ కేపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఆది నుంచే తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ప్రత్యర్థి ఢిల్లీ కేపిటల్స్ ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతా తెరవకముందే వికెట్ సమర్పించుకుంది. 0.3 బంతికి వార్నర్ ఔటయ్యాడు. అప్పటి నుంచి హైదరాబాద్ ఆటగాళ్లు వరుసగా వికెట్లు సమర్పించుకుంటూనే వచ్చారు. అబ్దుల్ సమద్ (28), రషీద్ ఖాన్ (22)తో రాణించారు. వార్నర్ డకౌట్ తర్వాత వృద్ధమాన్ సాహా కూడా పరుగులు చేయడంలో తడబడ్డాడు. 26 బంతుల్లో కేవలం 18 పరుగులు తీశాడు. ఆ తర్వాత ధవన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సాహా తర్వాత విలియమ్సన్ (18), మనీశ్ పాండే (17) భాగస్వామ్యంలో కాసేపు నిలకడగా ఆడారు. కేదర్ జాదవ్ మూడు పరుగులకే వెనుదిరిగాడు. హోల్డర్ కూడా పది పరుగులకే పెవిలియన్ చేరాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

