ఢిల్లీతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో మైదానం నలుమూలలా భారీ షాట్లు ఆడుతూ.. లక్నోను గెలుపు దిశగా నడిపిస్తున్న క్వింటన్ డీకాక్ (80)ను కుల్దీప్ యాదవ్ అవుట్ చేశాడు. 15వ ఓవర్లో బంతి అందుకున్న సౌతాఫ్రికా పేసర్ ఆన్రిచ్ నోర్జీ రెండో బంతికి దీపక్ హుడాను అవుట్ చేశాడు. కానీ అది హైట్ విషయంలో నోబాల్‌గా అంపైర్లు ప్రకటించారు.
అంతకుముందు డీకాక్ బ్యాటింగ్ సమయంలో కూడా అలాగే ఒక బీమర్ వేసిన నోర్జీ.. మరో బీమర్ వేయడంతో అతన్ని బౌలింగ్ చేయకుండా ఆపేశారు. దీంతో ఆ ఓవర్ ముగించడానికి వచ్చిన కుల్దీప్.. అదే ఓవర్ చివరి బంతికి డీకాక్‌ను బోల్తా కొట్టించాడు. కుల్దీప్ వేసిన బంతిని కవర్స్ మీదుగా బాదేందుకు డీకాక్ ప్రయత్నించాడు.
కానీ టైమింగ్ మిస్ అవడంతో షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది బంతి. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ ఆ క్యాచ్ అందుకోవడంతో డీకాక్ వెనుతిరిగాడు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసే సరికి లక్నో జట్టు 126/3 స్కోరుతో నిలిచింది. లక్నో విజయానికి ఇంకా 24 పరుగులు అవసరం ఉన్నాయి.