లక్నో సూపర్ జెయింట్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్లో ఉన్న ఓపెనర్ పృథ్వీ షా (5) అవుటయ్యాడు. దుష్మంత చమీర వేసిన రెండో ఓవర్ తొలి బంతికి బౌండరీ బాదిన షా.. తర్వాతి బంతికే అవుటయ్యాడు.
ఆఫ్వికెట్ ఆవలకు చమీర వేసిన బంతిని పుల్ చేయడానికి షా ప్రయత్నించాడు. ఈ క్రమంలో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. దాన్ని మిడ్వికెట్లో ఫీల్డింగ్ చేస్తున్న కృష్ణప్ప గౌతమ్ చక్కగా అందుకోవడంతో షా వెనుతిరిగాడు.