హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఎల్ వెంకట్రామ్రెడ్డి (ఎల్వీఆర్) స్మారక బాస్కెట్ బాల్ టోర్నీలో డీబీఏ ఆంథోని జట్టు.. ఎస్ఎస్బీఏపై విజయం సాధించింది. చాదర్‌ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా రెండో రోజు డీబీఏ.. 58-22తో ఘనవిజయం సాధించింది.
మరో పోరులో సెయింట్స్ జీ9 జట్టు.. 44-18తో రెడ్డి హాస్టల్ టీమ్‌పై గెలిచింది.