David Warner | సిడ్నీ: ఆస్ట్రేలియా డాషింగ్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు ఊరట లభించింది. 2018 సాండ్‌పేపర్ గేట్ వివాదంలో వార్నర్‌పై ఇన్ని రోజులుగా ఉన్న లైఫ్‌టైమ్ కెప్టెన్సీ, లీడర్షిప్ నిషేధాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తాజాగా ఎత్తివేసింది.
ముగ్గురు సభ్యులతో కూడిన స్వతంత్ర ప్యానెల్ శుక్రవారం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నెల మొదట్లో ప్యానెల్ ముందు విచారణకు హాజరైన వార్నర్..నిర్దేశిత ప్రమాణాలు అందుకున్నాడని భావించి సస్పెన్షన్ ఎత్తివేసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే వన్డే కెరీర్‌కు వీడ్కోలు పలికిన వార్నర్..ఆసీస్ తరఫున టీ20ల్లో ఆడుతున్నాడు.