దుబాయ్: ఐపీఎల్ ( IPL 2021 ) చరిత్రలో టాప్ 5లో బ్యాటర్స్‌లో డేవిడ్ వార్నర్ కూడా ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. డాషింగ్ ఓపెనర్‌గా, కెప్టెన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు ఓ బ్రాండ్ ఇమేజ్ తెచ్చిన ఘనత అతని సొంతం. హైదరాబాద్ టీమ్‌కు ఆడుతున్న కారణంగా అతడు తెలుగుతో, ఇక్కడి సినిమాలతో, ఇక్కడి ప్రజలతో ప్రత్యేక అనుబంధం కూడా పంచుకున్నాడు. తెలుగు హీరోలను ఇమిటేట్ చేస్తూ సోషల్ మీడియాలో వార్నర్ చేసిన పోస్ట్‌లు కూడా ఫ్యాన్స్‌కు తెగ నచ్చుతాయి.
అలాంటి వార్నర్ పరిస్థితి ఇప్పుడు సన్‌రైజర్స్ టీమ్‌లో అగమ్యగోచరంగా మారింది. ఎన్నో సీజన్ల పాటు ఆ టీమ్‌కు పెద్ద దిక్కుగా ఉన్న వార్నర్.. ఈ సీజన్లో బ్యాట్‌తో దారుణంగా విఫలమయ్యాడు. సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ కోల్పోయాడు. ఇప్పుడు టీమ్‌లో స్థానం కోల్పోవడంతోపాటు కనీసం స్టేడియానికి కూడా రాకుండా హోటల్ గదికే పరిమితమయ్యాడు.
ఈ నేపథ్యంలో అసలు వార్నర్‌తో సన్‌రైజర్స్ టీమ్ ఎందుకిలా ప్రవర్తిస్తోందన్న చర్చ అభిమానుల్లో మొదలైంది. ఆ మధ్య ఇక తాను మళ్లీ స్టేడియానికి రానని, అయినా టీమ్‌ను మాత్రం సపోర్ట్ చేస్తూనే ఉండండని పోస్ట్ చేసిన వార్నర్.. తాజాగా మరో పోస్ట్‌తో కొత్త చర్చకు తెరలేపాడు. గురువారం రాత్రి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో వార్నర్ పోస్ట్ చేసిన ఓ కోట్‌పై అభిమానుల్లో సీరియస్‌గా చర్చ జరుగుతోంది. మీ ముందు మీతో బాగుండే వాళ్ల గురించి కాదు, మీ వెనుక కూడా మీ గురించి తప్పుగా మాట్లాడని వారి గురించి అంటూ ఓ కోట్‌ను వార్నర్ పోస్ట్ చేశాడు.
అంతకుముందు చెన్నైతో సన్‌రైజర్స్ మ్యాచ్‌ను టీవీలో చూస్తున్న వీడియోను కూడా వార్నర్ షేర్ చేశాడు. అయితే వార్నర్‌ను కనీసం స్టేడియానికి కూడా రానీయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ బోరియా మజుందార్ ట్విటర్ వేదికగా సన్‌రైజర్స్ టీమ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. అతన్ని స్టేడియానికి కూడా రానీయకపోవడం అవమానించడమే. కనీసం 18 మందిలో ఉండే అర్హత అతనికి లేదా? అతనితో డ్రింక్స్ అయినా పంపించండి. టీమ్‌కు ఓ ఇమేజ్ తీసుకొచ్చే ప్లేయర్ అతడు. అలాంటి ప్లేయర్‌ను హోటల్‌కే పరిమితం చేసి మీ ఫ్యాన్ బేస్ కోల్పోతున్నారు. అసలు సన్‌రైజర్స్ టీమ్‌లో ఇలాంటి నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు అని ఆయన ప్రశ్నించారు.
We were told Warner not there bec youngsters were being given an opportunity to experience the IPL. Nabi was in the substitute list today. Manish was there. Don’t play him, that’s ok. But to not let Dave Warner come to the ground is disrespect. Could have been avoided.
— Boria Majumdar (@BoriaMajumdar) September 30, 2021
I don’t think Warner is that bad to not make it to the 18. Second let him carry drinks. He builds your brand. He is good TV. He connects with fans. By kicking him out and not allowing him to come to the hotel, you are losing your fan base. Who is taking these calls for Sunrisers?
— Boria Majumdar (@BoriaMajumdar) September 30, 2021