టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ మ్యాచ్ పోరుకు రంగం సిద్ధమైంది. ఇంకొన్ని నిమిషాల్లో పోరు ప్రారంభం కానుంది. ప్రపంచ క్రికెట్ అభిమానులు మొత్తం.. టీవీలకు అతుక్కుపోయారు. ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందా.. ఎవరు గెలుస్తారు.. ఏ టీమ్ ఈసారి కప్ కొట్టి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడబోతుంది అంటూ చర్చించుకుంటున్నారు.
ఫైనల్ పోరు.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అయితే.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్‌తో సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతున్నాడు. ఈ మ్యాచ్‌లో వార్నర్ 30 పరుగులు చేస్తే చాలు.. టీ20 వరల్డ్ కప్ సింగిల్ టోర్నీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నాడు. ఆస్ట్రేలియా నుంచి ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా నుంచి అత్యధిక పరుగులు సాధించింది మాథ్యూ హైడెన్. 2007లో మాథ్యూ 265 పరుగులు సాధించి టాప్‌లో నిలవగా.. 2012లో షేన్ వాట్సన్ 249 పరుగులు సాధించి సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.
ఈ టీ20 వరల్డ్ కప్‌లో డేవిడ్ వార్నర్.. ఇప్పటి వరకు 236 పరుగులు చేశాడు. ఇంకో 30 పరుగులు చేస్తే మాథ్యూను దాటేసి ఆస్ట్రేలియా నుంచి టీ20 ప్రపంచ కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేసినట్టే. చూద్దాం మరి.. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తాడో లేదో?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
T20 World Cup Final : ఈమ్యాచ్‌లోనూ టాసే కీలకం.. టాస్ గెలిచిన జట్టుదే ట్రోఫీ.. కారణం ఇదే
T20 World Cup Final : ఈసారి ట్రోఫీ ఆ జట్టుకేనట.. ఎలాగో కూడా చెప్పేసిన నెటిజన్లు
ఆసీస్, కివీస్ ఎన్నిసార్లు టీ20లలో పోటీపడ్డాయి? ఏ టీమ్ ఎక్కువసార్లు గెలిచింది?
VVS Laxman | జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్