హొబార్ట్: విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (36 బంతుల్లో 70; 12 ఫోర్లు, ఒక సిక్సర్) దుమ్మురేపడంతో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా జయకేతనం ఎగరవేసింది. తన వందో అంతర్జాతీయ టీ20లో వార్నర్ శివాలెత్తడంతో శుక్రవారం జరిగిన పోరులో ఆసీస్ 11 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తుచేసింది.
మొదట ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది. వార్నర్‌తో పాటు ఇంగ్లిస్ (39), టిమ్ డేవిడ్ (37) రాణించారు. విండీస్ బౌలర్లలో రస్సెల్ 3, అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో వెస్టిండీస్ 8 వికెట్ల నష్టానికి 202 పరుగులకు పరిమితమైంది. బ్రాండన్ కింగ్ (53), చార్లెస్ (42), హోల్డర్ (34 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. కంగారూ బౌలర్లలో జాంపా 3 వికెట్లు తీశాడు.