పెర్త్: విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (164; 16 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ సెంచరీతో చెలరేగడంతో పాకిస్థాన్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ గురువారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది.
ఈ సిరీస్‌తో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్న వార్నర్.. పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పరిమిత ఓవర్ల తరహాలో ధనాధన్ ఆటతో చెలరేగాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (41), ట్రావిస్ హెడ్ (40) రాణించారు. మిషెల్ మార్ష్ (15), అలెక్స్ కారీ (14) క్రీజులో ఉన్నారు. పాకిస్థాన్ బౌలర్లలో జమాల్ రెండు వికెట్లు పడగొట్టాడు.