David Warner | ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ఇక్కడ అభిమానులకు దగ్గరయ్యాడు. వార్నర్‌కు క్రికెట్ మాత్రమే కాదు.. ఇతర యాక్టివిటీలు కూడా ఎక్కువే. ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన రీల్స్‌తో అభిమానులు ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటాడు ఈ స్టార్ క్రికెటర్. కొత్త సినిమా వచ్చిందంటే చాలు అందులోని తనకు ఇష్టమైన డైలాగ్ లేదా పాటను అనుసరిస్తూ కుటుంబంతో కలిసి రీల్స్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటాడు. ఇటీవల ‘డీజే టిల్లు’ లుక్, పుష్ప లుక్‌తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్.. వార్నర్‌కు ఓ సూచన చేసింది. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సినిమాల్లో నటించాలని సూచించింది. ‘డేవిడ్ వార్నర్ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత.. తెలుగు సినిమాల్లో నటించాలి. ఇదే అతడికి సరైన వేదికగా మేం భావిస్తున్నాం’ అంటూ ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన వార్నర్.. నెట్‌ఫ్లిక్స్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ నవ్వుతున్న ఎమోజీలను పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
😂😂😂😂😂 https://t.co/d5739HLOAZ
— David Warner (@davidwarner31) January 5, 2023