ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. మనీశ్ పాండే, డేవిడ్ వార్నర్ అర్ధశతకాలతో చెలరేగడంతో 16వ ఓవర్లోనే హైదరాబాద్ 120 పరుగుల మార్క్ అధిగమించింది. జడేజా వేసిన 16వ ఓవర్లో భారీ సిక్సర్ బాదిన వార్నర్ ఐపీఎల్లో 50వ హాఫ్‌సెంచరీని నమోదు చేశాడు. చెన్నై బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తున్నారు. చేతిలో వికెట్లు ఉండటంతో ఆఖర్లో చెలరేగాలని రైజర్స్ భావిస్తోంది. 16 ఓవర్లకు హైదరాబాద్ వికెట్ నష్టానికి 121 పరుగులు చేసింది. పాండే(52), వార్నర్(55) క్రీజులో ఉన్నారు.
Congratulations to @SunRisers captain @davidwarner31 for becoming the first batsman to register 50 half-centuries in #VIVOIPL https://t.co/dvbR7X1Kzc #VIVOIPL #CSKvSRH pic.twitter.com/YPkcphuLv5
— IndianPremierLeague (@IPL) April 28, 2021