David Malan లండన్: ఇంగ్లండ్ ఆటగాడు డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్‌గా మెరుపులు మెరిపించిన మలన్ మంగళవారం ఓ బ్రిటీష్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. 36 ఏండ్ల మలన్ తన కెరీర్లో 22 టెస్టులు (1,074 పరుగులు), 30 వన్డేలు (1,450), 62 టీ20లు (1,892) ఆడాడు. పొట్టి ఫార్మాట్లో మెరుపులు మెరిపించిన మలన్ 2020లో కొన్ని వారాల పాటు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. 2022లో టీ20 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.