సింగపూర్: ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో తొలి గేమ్‌లో ఓటమిపాలైన భారత గ్రాండ్‌మాస్టర్ రెండో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో మంగళవారం ఇక్కడ జరిగిన రెండో గేమ్‌లో నల్ల పావులతో ఆడిన గుకేశ్.. సోమవారం నాటి తప్పిదాలను పునరావృతం కాకుండా జాగ్రత్తపడ్డాడు. గుకేశ్ 23వ ఎత్తు తర్వాత ఆట డ్రాగా ముగిసింది.
ఈ డ్రాతో టోర్నీలో లిరెన్ 1.5 పాయింట్లతో ఉండగా గుకేశ్ 0.5 పాయింట్లు సాధించాడు. 14 గేమ్‌లు ఉండే ఈ ఈవెంట్లో ఎవరైతే ముందుగా 7.5 పాయింట్లు సాధిస్తారో వాళ్లు విజేతగా నిలుస్తారు.